- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐబొమ్మ రవికి బిగ్ షాక్.. తీర్పు వాయిదా
by Ramesh Naini |
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీమా పైరసీ కేసులో ప్రధాన నిందితుడు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి బిగ్ షాక్ తగిలింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీమా పైరసీ కేసులో ప్రధాన నిందితుడు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి బిగ్ షాక్ తగిలింది. గురువారం ఆయన బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి క్రిమినల్ కోర్టు తిరస్కరించింది. మూడో దఫా కస్టడీ విషయంలో సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి అప్పీల్‌కు వెళ్లారు. ఎనిమిది రోజుల కస్టడీకి ఇవ్వాలని సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీ రివిజన్ పిటిషన్ వేశారు. దీంతో రవి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇవాళ సైబర్ క్రైమ్ పోలీసుల అప్పీల్‌ను విచారిస్తూనే మరోవైపు రవి బెయిల్ పిటిషన్‌పై కోర్టు పరిశీలిచింది. ఐబొమ్మ కేసు తీవ్రత దృష్ట్యా రవి బెయిల్‌కు అనర్హుడని పిటిషన్‌ను తిరస్కరించింది. అదేవిధంగా ఐబొమ్మ రవి కేసులో పోలీసులు వేసిన కస్టడీ రివిజన్ పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా వేసింది.
Next Story






