- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐబొమ్మ రవి కేసు.. మరో మూడ్రోజులు కస్టడీకి ఇచ్చిన కోర్టు
ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు మరో మూడురోజులు కస్టడీ విధించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు మరో మూడురోజులు కస్టడీ విధించింది. ఇప్పటికే రవిని ఐదురోజులు విచారించిన సీసీఎస్ పోలీసులు.. మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. ఐదురోజుల విచారణలో రవి నుంచి అసలైన సమాచారం రాబట్టలేకపోయినట్లు పోలీసులు కోర్టుకు తెలిపినట్లు సమాచారం. పోలీసుల పిటిషన్ ను పరిశీలించిన కోర్టు మరో మూడురోజులు కస్టడీకి అంగీకరించింది. కోర్టు తీర్పుతో పోలీసులు రేపు రవిని చంచల్ గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకోనున్నారు. ఈసారి మూడ్రోజుల విచారణలో రవి నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గుర్తులేదు, మర్చిపోయానన్న సమాధానాలకు తావులేకుండా.. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలని పోలీసులు యోచిస్తున్నారు. అంతకుముందు పోలీసులు రవినికోర్టులో హాజరు పరచగా.. కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
మరో 3 కేసుల్లోనూ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. కోర్టు అనుమతితో పోలీసులు రవి అరెస్టును చూపించనున్నారు. తాజా కస్టడీలో ఐ-బొమ్మ రవి సినిమా పైరసీ ద్వారా దాదాపు 100 కోట్ల రూపాయలు సంపాదించాడని గుర్తించారు. మూడు రోజుల విచారణలో ఈ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను పోలీసులు రాబట్టనున్నారు. వీటిలో దాదాపు 30 కోట్ల రూపాయల వరకు రవి తన 35 బ్యాంకు ఖాతాల ద్వారా లావాదేవీలు జరిపినట్లు గుర్తించిన పోలీసులు మరిన్ని వివరాలను సేకరించేందుకు ప్రయత్నించనున్నారు. రవి ఒకడేనా లేదా అతని వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయాలను ఆరా తీయనున్నారు. అతనిపై 5 కేసులు నమోదైన విషయం తెలిసిందే.






