- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nalla Connection Bills: నల్లా బిల్లుల బకాయిలు రూ.562 కోట్లు.. అక్టోబరులో వచ్చింది రూ.49 కోట్లే..!
హైదరాబాద్(HYD) నగరంలో దీర్ఘకాలికంగా పేరుకుపోయిన నల్లా కనెక్షన్ బిల్లుల(Nalla Connection Bills)ను వసూలు చేసేందుకు జలమండలి ఓటీఎస్(OTS) ప్రవేశపెట్టింది.

దిశ, సిటీబ్యూరో : హైదరాబాద్(HYD) నగరంలో దీర్ఘకాలికంగా పేరుకుపోయిన నల్లా కనెక్షన్ బిల్లుల(Nalla Connection Bills)ను వసూలు చేసేందుకు జలమండలి ఓటీఎస్(OTS) ప్రవేశపెట్టింది. దీని ద్వారా పెండింగ్‌లో ఉన్న నల్లా బిల్లులు ఎలాంటి ఆలస్య రుసుం(Late Fee), వడ్డీ(Interest) లేకుండా చెల్లించే అవకాశాన్ని కల్పించింది. మొదటగా ఈ పథకాన్ని అక్టోబర్ 1 నుంచి 31 వరకు ప్రకటించి అమలు చేశారు. కానీ ఇదే నెలలో దసరా(Dussehra), దీపావళి(Diwali) వంటి పండుగలు రావడంతో వినియోగదారులపై ఆర్థికభారం పడింది. కొందరు సొంతూళ్లకు వెళ్లడంతో వారు ఈ పథకాన్ని వినియోగించుకోలేకపోయారు. దీంతో మరో అవకాశం ఇవ్వాలని కోరాగా.. గడువును నవంబర్ 30 వరకు పొడిగించింది. అయినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఓ కారణం ఉంది. ఒకటి 2020లో ఓటీఎస్ ద్వారా ప్రయోజనం పొందిన వారికి అవకాశం లేకపోవడం, రెండోది ఈసారి ఓటీఎస్ ద్వారా ప్రయోజనం పొందినా.. రెండు నెలలు ఏదైనా సమస్య కారణంగా బిల్లులు చెల్లించకపోతే ఆలస్య రుసుం, వడ్డీతో సహా మొత్తం చెల్లించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. ఈ రెండింటి కారణంగా ఓటీఎస్‌కు ఆశించిన స్థాయిలో ఆదరణ రాలేదని క్షేత్రస్థా అధికారులు చెబుతున్నారు.
అక్టోబర్‌లో వచ్చింది రూ.49కోట్లే.. నవంబర్‌లో..?
జలమండలిలో పరిధిలో 7,11,030 క్యాన్ నెంబర్ల నుంచి రూ.1,792 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. వీటిలో వడ్డీ, పెనాల్టీ కలిపి మాఫీ కావాల్సింది రూ.1,230 కోట్లు. మిగిలిన బకాయిలు రూ.562 కోట్లు మాత్రమే. వీటిలో అక్టోబర్ 31 వరకు రూ.49 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ సమయంలో దాదాపు 70,335 మంది వినియోగదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వీరికి మాఫీ చేసిన మొత్తం (వడ్డీ, పెనాల్టీ) రూ.17 కోట్లు మాత్రమే. కాగా నవంబర్‌లో ఎంత మంది, ఎంత చెల్లించారనేది అధికారులు చెప్పడంలేదు. ఓ అధికారిని వివరణ కోరగా ఇంకా లెక్కలు రాలేదు, నేను బిజీగా ఉన్నా..తరువాత కాల్ చేస్తా అంటూ దాటవేశాడు. దీంతో మళ్లీ గడువు పొడిగించేందుకు అవకాశముందా? లేదా? అని నగరవాసులు సందేహం వ్యక్తంచేస్తున్నారు. దీనిపై జలమండలి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.






