మద్యం మత్తుకు బానిసై యువకుడి ఆత్మహత్య.. అప్పుల భారం మింగేసిన జీవితం

by Bhanu |

మద్యం మత్తులో మునిగిపోయిన ఓ యువకుడు ఆర్థిక భారాన్ని తట్టుకోలేక చివరకు జీవితం నుంచి బయటపడేందుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది.

మద్యం మత్తుకు బానిసై యువకుడి ఆత్మహత్య.. అప్పుల భారం మింగేసిన జీవితం
X

దిశ, చండూరు: మద్యం మత్తులో మునిగిపోయిన ఓ యువకుడు ఆర్థిక భారాన్ని తట్టుకోలేక చివరకు జీవితం నుంచి బయటపడేందుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చండూరు మున్సిపాలిటీలోని సర్దార్ కాలనీకి చెందిన అన్నపురెడ్డి మహేష్ (30) గత కొంతకాలంగా మద్యం అలవాటుకు బానిసయ్యాడు. మద్యానికి డబ్బులు అవసరమవడంతో తన పరిచయంలోని స్నేహితుల వద్ద చేతి బదులుగా అప్పులు చేశాడు. కానీ వాటిని తిరిగి చెల్లించలేక మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు.

ఈ క్రమంలో జూన్ 23న, సోమవారం, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు మహేష్‌ను వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అదే రాత్రి మహేష్ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుని తండ్రి అన్నపురెడ్డి నరసింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్‌ఐ వెంకన్న ఈ విషయాన్ని ధృవీకరించారు.

Next Story