- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి యువకుడి ఆత్మహత్యయత్నం.. తీవ్ర గాయాలు
కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

దిశ, హాలియా : కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం తిరుమలగిరి (సాగర్) మండలంలోని అల్వాల తండా గ్రామానికి చెందిన జటావత్ ప్రదీప్ అలియాస్ చింటూ (25) బుధవారం రాత్రి హాలియా పట్టణంలో మద్యం సేవించి ముందుగా పురుగుల మందు తాగానంటూ బంధువులకు సమాచారం తెలిపినట్లు తెలిసింది. వెంటనే బంధువులు హాలియా చేరుకొని సమీపంలోని స్థానిక ఆసుపత్రికి తరలించే సమయంలో విడిపించుకుని ప్రదీప్ వెంకటరమణ రైస్ మిల్ సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ను ఎక్కి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.
వెంటనే స్థానికులతో పాటు బంధువులు విద్యుత్ అధికారులకు సమాచారం అందించడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అప్పటికే ప్రదీప్ ట్రాన్స్ ఫార్మర్ పైన ఉండడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. వెంటనే 108 వాహనంలో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి సీరియస్ గా ఉండడంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రుడు తీవ్ర గాయాల కారణంగా చికిత్స పొందుతున్నట్లు బంధువులు తెలిపారు. క్షతగాత్రునికి భార్య ఒక పాప ఉన్నట్లు బంధువులు తెలిపారు.






