రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..

by Bhanu |

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని పొద్దుటూరు - ఏదుళ్ళగూడెం గ్రామాల మధ్య ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..
X

దిశ,వలిగొండ: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని పొద్దుటూరు - ఏదుళ్ళగూడెం గ్రామాల మధ్య ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత చోటుచేసుకుంది.వివరాలు నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన అంతటి అంజయ్య భార్య పద్మ కుమారుడు అంతటి అజయ్ కుమార్ (26 )బంధువుల వివాహ వేడుకలకు మండలంలోని పొద్దుటూరు గ్రామానికి వచ్చారు. ఆదివారం వివాహ అనంతరం రాత్రి భోజనం చేసిన తరువాత బంధువైన పల్చం బానుచందర్ బైక్ తీసుకొని ఆరేన్ లైఫ్ సైన్స్ స్ లో ఉద్యోగ నిమిత్తం బయలుదేరి అతివేగంగా అజాగ్రత్తగా బైక్ నడుపుతూ వెళ్లి చెన్నేరు కల్వర్టుకు ఢీకొనగా తలకు తీవ్ర గాయాలై నీటిలో పడిపోయి మృతి చెందాడు. సోమవారం మృతుని తండ్రి అంజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యుగేందర్ గౌడ్ తెలిపారు.

Next Story