- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య
ఉరి వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జూలూరు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.

దిశ, భూదాన్ పోచంపల్లి : ఉరి వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జూలూరు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన విధాల ప్రకారం. గ్రామానికి చెందిన యాకరి ప్రశాంత్ (31) వ్యవసాయం పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ప్రశాంత్ పొలం పనిమీద వెళ్లి ఇంటికి వచ్చి ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు చున్నీతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ప్రశాంత్ తల్లి యాకరి సుశీల మండలంలోని దేశ్ముఖి గ్రామంలో గల గురుకుల పాఠశాలలో స్విపర్ పని చేసుకుంటూ ఉండేది.అయితే రోజువారి లాగా పని ముగించుకొని ఇంటికి వచ్చి చూసేసరికి ప్రశాంత్ సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించడంతో లబోదిబోమంది .ఇరుగుపొరుగు వారిని పిలిచి ప్రశాంత్ ను కిందికి దింపగా అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించీ కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుడి తండ్రి యాకరి యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు.






