రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

by Bhanu |

తిప్పర్తి కుక్కడం రైల్వే స్టేషన్ల మధ్య కొత్తగూడెం గ్రామంలో గురువారం ఉదయం 9:10 గంటల ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది.

రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య
X

దిశ, మాడుగులపల్లి : తిప్పర్తి కుక్కడం రైల్వే స్టేషన్ల మధ్య కొత్తగూడెం గ్రామంలో గురువారం ఉదయం 9:10 గంటల ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. తిప్పర్తి మండలం సిలర్మియాగూడెం గ్రామానికి చెందిన రాయి మహేందర్ (21), తండ్రి సైదులు, ప్రైవేట్ ఫైనాన్స్ వృత్తిలో ఉండేవాడు.


ఆర్థిక ఇబ్బందులు కారణంగా జీవితంపై విరక్తి చెంది, గుంటూరు నుండి వికారాబాద్ వైపు వెళ్తున్న పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ బి. రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలిపారు.

Next Story