- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అరుదైన చికిత్స చేసిన యశోద ఆసుపత్రి వైద్య బృందం
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ప్రాణాలు కాపాడింది మలక్ పేట యశోద ఆసుపత్రి వైద్య బృందం. ఆ యువకుడికి

దిశ, నాగార్జునసాగర్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ప్రాణాలు కాపాడింది మలక్ పేట యశోద ఆసుపత్రి వైద్య బృందం. ఆ యువకుడికి అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన వైద్య చికిత్స అందించి అతన్ని కాపాడారు. దీంతో వైద్య సిబ్బందికి యువకుని కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ సోమవారం విజయ విహార్ అతిధి గృహంలో ఏర్పాటు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం యశోద ఆసుపత్రి వైద్యులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా ముఖ్యమైనది, అనారోగ్య స్థితిలో ఉన్నవారికి హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతగానో తోడ్పడుతుందన్నారు.
నల్గొండ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన 20 ఏళ్ల మోకరాల పవన్ ప్రాణాలను కాపాడటమే కాక,అతని కాలును కూడా పూర్వ స్థితికి తీసుకువచ్చామన్నారు. 25-05-2025న జరిగిన రోడ్డు ప్రమాదంలో రోగికి ఎడమ కాలు తొడ భాగంలో ఎముక విరగడం వల్ల, ఫీమోరల్ ఆర్టరీ చిట్లి రక్తప్రసరణ ఆగిపోయి ప్రాణాంతక పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితిలో అతని కాలుకు మెరుగైన చికిత్స అందించారు యశోద వైద్యులు. అత్యంత క్లిష్టతరమైన జబ్బులు,వ్యాధులకు కూడా చికిత్స జరుగుతోందని మలక్ పేట యశోదా హాస్పిటల్స్ డైరెక్టర్ గోరుకంటి పవన్,యూనిట్ హెడ్ కె.శ్రీనివాసరెడ్డి, జనరల్ మేనేజర్ శ్రీనివాస్ వాసు,కిరణ్ రెడ్డి వెల్లడించారు.






