- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేనేతకు ప్రోత్సాహం..శిల్పారామం ఆవిష్కరణతో ఉత్సాహం
చేనేత హస్తకళలకు మరింత ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరముందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : చేనేత హస్తకళలకు మరింత ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరముందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం యాదగిరిగుట్ట రాయిగిరి మధ్య ఏర్పాటు చేసిన మినీ శిల్పారామాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా శిల్పారామాన్ని సందర్శించి పచ్చదనం, కళల శోభను ఆస్వాదిస్తూ, చేనేత కళాకారుల ప్రతిభకు ప్రోత్సాహం ఇచ్చారు.
చేనేత కళాకారులకు యాదగిరిగుట్టలో వేదిక లభించడం సంతోషకరమని పేర్కొన్నారు. యాదగిరిగుట్టకు వచ్చే సందర్శకులు శిల్పారామం సందర్శించి స్థానిక చేనేత కళాకారులను ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా బోటింగ్ నిర్వహించి ముఖ్య అతిథులు సంతోషం వ్యక్తం చేశారు. చేనేత హస్తకళలను ప్రోత్సహించేలా, స్థానిక కళాకారులకు ప్రాముఖ్యతనిచ్చేలా మినీ శిల్పారామం విశేషంగా ఆకర్షణీయమని వారు పేర్కొన్నారు.






