ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేయాలి - కలెక్టర్ హనుమంతరావు

by velandi.Saikiran |

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేయాలి -  కలెక్టర్ హనుమంతరావు
X

దిశ, భూదాన్ పోచంపల్లి: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని పెద్ద రావులపల్లి గ్రామంలో గల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామానికి మొత్తం ఎన్ని ఇండ్లు మంజూరు అయ్యాయని, ఎన్ని ప్రారంభం అయ్యాయని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రారంభం కానీ ఇండ్లను త్వరగా ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఆకౌంట్లో డబ్బులు జమ అయ్యాయా ? అని అడిగి తెలుసుకున్నారు. మేస్త్రీలకు, ఇటుక, స్టీలు, సిమెంటు వంటి వాటికి జిల్లా స్థాయి నిర్ణయించిన రేటు ప్రకారమే ఇవ్వాలని తెలిపారు. వీరితోపాటు హౌసింగ్ ఏఈ శివాజీ, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ నాయక్ తదితరులు ఉన్నారు.

Next Story