ప్రపంచం చూపు కమ్యూనిజం వైపే : సీపీఐ

by Ratna Kumari |

దిశ, మునుగోడు/సంస్థాన్ నారాయణపురం/చౌటుప్పల్ : ప్రపంచం చూపంత కమ్యూనిస్టుల వైపే ఉందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ రాష్ట్ర

ప్రపంచం చూపు కమ్యూనిజం వైపే :  సీపీఐ
X

దిశ, మునుగోడు/సంస్థాన్ నారాయణపురం/చౌటుప్పల్ : ప్రపంచం చూపంత కమ్యూనిస్టుల వైపే ఉందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల నరసింహ అన్నారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ స్వాతంత్రం కోసం సీపీఐ ఎల్లప్పుడు పోరాడుతుందన్నారు. ఈనెల 15న గద్వాల నుంచి ఖమ్మం వరకు ప్రారంభమైన ప్రచార బస్సు జాత బుధవారం మునుగోడు నియోజకవర్గం లోని మునుగోడు, గట్టుప్పల్, సంస్థాన్ నారాయపురం చౌటుప్పల్ మండలాల మీదుగా కొనసాగింది. ఆయా మండలాల్లో మండల సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టజీవుల సమస్యల పరిష్కారానికై సిపిఐ గర్జించే గొంతుకై నిలబడుతుందన్నారు. ఎకరానికి పత్తి 12 క్వింటాలు అమ్మాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం 7 క్వింటాలకు పరిమితం చేసి మిగిలిన పత్తిని పరోక్షంగా దళారులకు అమ్మే విధంగా చేస్తూ వారిని ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. 45 సంవత్సరాల క్రితం పెత్తందారుల గడీల ముందు నుండి చెప్పులు వేసుకుని పోలేని పరిస్థితి ఉండేదని, ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం కావాలని అందరూ సమానంగా బతకాలని వారి కోసం సీపీఐ పోరాటాలు చేసిందన్నారు.


ప్రజా సమస్యల పరిష్కారానికి ఎర్రజెండా అనేక పోరాటాలలో ముందు ఉందన్నారు. ఒక సీపీఐ కార్యకర్త 100 మందితో సమానం అన్నారు. ప్రపంచమంతా సీపీఐ వైపు చూస్తున్నారని 100 సంవత్సరాల కాలంలో సాధించిన విజయాలను నెమరు వేసుకొని ఈ దేశంలో బలమైన పార్టీగా సిపిఐ నిలుస్తుందన్నారు. ఈ నెల 26న ఖమ్మంలో జరగబోయే 100 సంవత్సరాల ముగింపు సభ దేశ, రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిలబెడుతుందన్నారు. ఈ సభకు సీపీఐ కార్యకర్తలు కార్మికులు, కర్షకులు, శ్రామికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు కే.శ్రీనివాస్, సీపీఐ యాదాద్రి జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు గురుజ రామచంద్రం, బోల్గురి నరసింహ, తీర్పారి వెంకటేశ్వర్లు, బచ్చనగోని గాలయ్య,పల్లె శేఖర్ రెడ్డి, మునుగోడు, సంస్థాన్ నారాయణపురం మండల పార్టీ కార్యదర్శి చాపల శ్రీను,దుబ్బాక భాస్కర్, జిల్లా కార్యవర్గ సభ్యులు బోడ సుదర్శన్, ఎండి ఇమ్రాన్, జిల్లా సమితి సభ్యులు చిలువేరు అంజయ్య, కలకొండ సంజీవ,సురిగి చలపతి, గోస్కొండ లింగయ్య, బండమీది యాదయ్య, మందులపాండు, వనం వెంకన్న, ఉప్పునూతల రమేష్, మంచాల జంగయ్య, మంచాల సైదులు, పల్లె మల్లారెడ్డి, వీరమల్ల యాదయ్య, సుర్వి నరసింహ,పందుల యాదగిరి పాల్గొన్నారు.

Next Story