మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు : కలెక్టర్

by Naveena |

మహిళలు అన్ని రంగాలలో ముందు ఉన్నారని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు : కలెక్టర్
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : మహిళలు అన్ని రంగాలలో ముందు ఉన్నారని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఆటల పోటీలను కలెక్టరేట్ ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..మహిళా క్రీడోత్సవాలను ప్రారంభించి మహిళలు అన్ని రంగాలతో పాటు క్రీడలలో కూడా పాల్గొన్నారు. మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృడత్వము, మనసు ఏకగ్రత కలిగి ఉండాలన్నారు. జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ వీరా రెడ్డి మాట్లాడుతూ క్రీడల వల్ల పని ఒత్తిడి తగ్గించుకోవచ్చని అందరూ కూడా క్రీడలు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరారు.

జిల్లా అడిషనల్ కలెక్టర్ గంగాధర్ (లోకల్ బాడీ) మాట్లాడుతూ ..మహిళలు ఉద్యోగ బాధ్యతలతో పాటు మానసిక ఉల్లాసం ఉంటుందన్నారు. మహిళలు క్రీడలలో కూడా ముందుండాలని కోరారు. క్రీడలు ఈ నెల 05, 06, 07రోజులలో జిల్లా కల్లెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో టెన్నికయిట్, షటిల్ ,చెస్, క్యారమ్స్, స్కిప్పింగ్, లెమన్ అండ్ స్పూన్, స్పీడ్ వాక్, రన్నింగ్, మ్యూజికల్ బాల్, గ్లాస్ పిరమిడ్ , సింగింగ్& మ్యూజికల్ చైర్ మొదలగు క్రీడలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సి.ఇ.ఓ. శోభారాణి, యాదాద్రి లక్ష్మి నర్సింహా స్వామి దేవాదాయశాఖ ఈ.ఓ. భాస్కర్ రావు , ఉపేందర్ రెడ్డి , జగన్, దశరథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story