- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓ మహిళ మరణిస్తూ మరో ఆరుగురికి ప్రాణదానం
by Bhoopathi Nagaiah |
ఓ మహిళ తాను మరణిస్తూ మరో ఆరుగురికి ప్రాణదానం చేసిన సంఘటన మర్రిగూడ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

X
దిశ ,మర్రిగూడ: ఓ మహిళ తాను మరణిస్తూ మరో ఆరుగురికి ప్రాణదానం చేసిన సంఘటన మర్రిగూడ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.మండల కేంద్రానికి చెందిన చెరుకు యాదమ్మ బ్రెయిన్ డెడ్ తో శనివారం హైదరాబాదులోని కామినేని ఆసుపత్రిలో మృతి చెందింది. కుటుంబ సభ్యులు అవయవాలను దానం చేసి ఆరుగురు వ్యక్తులకు పునర్జన్మను ప్రసాదించారు. కష్టకాలంలో కుటుంబ సభ్యులు చూపిన సాటిలేని మానవత్వం సమాజానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆ కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. మృతి చెందిన యాదమ్మ భర్త కూడా అనారోగ్య కారణాలతోనే మృతి చెందాడు. కుమార్తె వివాహం కాగా కుమారుడు ఏకాకిగా మిగిలి తల్లి మరణంతో రోదిస్తున్న సంఘటన చూపర్లను కంటతడి పెట్టించింది. ఏది ఏమైనా పోతూ పోతూ ఆరుగురు వ్యక్తులకు పునర్జన్మన ప్రసాదించడం సమాజానికే ఆదర్శంగా నిలుస్తుంది.
Next Story






