ప్రమాద వశాత్తు మంటలంటుకొని మహిళకు తీవ్రగాయాలు...

by Bhanu |

ప్రమాదవశాత్తు మంటలంటుకొన్న ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని గొల్నెపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది.

ప్రమాద వశాత్తు మంటలంటుకొని మహిళకు తీవ్రగాయాలు...
X

దిశ, వలిగొండ: ప్రమాదవశాత్తు మంటలంటుకొన్న ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని గొల్నెపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం గొల్నెపల్లి గ్రామానికి చెందిన కత్రోజు లావణ్య అనే మహిళ సాయంత్రం ఇంటివద్ద చెత్త తగల పెడుతుండగా ప్రమాదవశాత్తు మంటలంటుకొని మహిళ తీవ్రంగా గాయపడిందని స్థానికుల ఇచ్చిన సమాచారం మేరకు 108 సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం భువనగిరి ప్రభుత్వ పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదారాబాద్ లోనిగాంధీ ఆసుపత్రికి తరలించినట్లు 108 సిబ్బంది తెలిపారు.


Next Story