- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేనేత రుణమాఫీ వచ్చుడో.. మేము చచ్చుడో..?
చేనేత రుణమాపీ వచ్చుడో మేము చచ్చుడో అనే నినాదంతో చేనేత కార్మికులు రెండు రోజులుగా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.

దిశ, సంస్థాన్ నారాయణపురం : చేనేత రుణమాపీ వచ్చుడో మేము చచ్చుడో అనే నినాదంతో చేనేత కార్మికులు రెండు రోజులుగా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో సోమవారం నుంచి చేనేత కార్మికులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. చేనేత రుణమాఫీ చేసేంతవరకు తమ దీక్షను విరమించేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. వర్కాల వెంకటేశం, గుడెల్లి బాలరాజు ఇద్దరు చేనేత కార్మికులు సోమవారం ఉదయం నుంచి ఈ ఆమరణ దీక్షకు దిగారు. మంగళవారం పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లకాటి రాజకుమార్ ఈ దీక్షకు మద్దతు తెలుపుతూ ఆయన కూడా దీక్షలో భాగస్వామి అయ్యారు. చేనేత కార్మికుల రుణమాఫీ చేయాలని ప్రధాన డిమాండ్ తో పాటు నేతన్న భరోసా నేరుగా చేనేతల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు అందరికీ జియో ట్యాగ్ నెంబర్ ఇవ్వడంతో పాటు, చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ మాఫీ చేయాలన్నారు. వీటితోపాటు మరికొన్ని డిమాండ్లను నెరవేర్చే వరకు తమ ఆమరణ దీక్ష విరమించేది లేదని అన్నారు. గతంలో చేనేత జౌలి శాఖ సెక్రెటరీ శైలజారామయ్యర్ ఇచ్చిన హామీ ఇంకా నెరవేరలేదని గుర్తు చేశారు. ఆమరణ నిరాహార దీక్ష విషయం తెలుసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత జౌళి శాఖ ఏడి శ్రీనివాస్ పుట్టపాక దీక్ష శిబిరానికి హాజరై చేనేత రుణమాఫీ అంశం పై ఇప్పటికే ప్రక్రియ మొదలైందని దయచేసి దీక్ష విరమించాలని కోరారు. అయినా కూడా దీక్ష విరమించేది లేదని చేనేత కార్మికులు భీష్మించుకు కూర్చున్నారు. రెండు రోజులుగా దీక్ష చేస్తున్న చేనేత కార్మికుల ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు తెలుస్తుంది.






