- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో భార్య మృతి.. భర్తకు తీవ్ర గాయాలు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం-ధర్మోజీగూ డెం గ్రామాల మధ్య 65వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుబ్బాక నాగరాజు (45), సంతోష (35)లు తీవ్రంగా గాయపడ్డారు.

దిశ, చౌటుప్పల్ టౌన్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం-ధర్మోజీగూ డెం గ్రామాల మధ్య 65వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుబ్బాక నాగరాజు (45), సంతోష (35)లు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో దుబ్బాక సంతోష ఆసుపత్రి లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందగా...ఆమె భర్త నాగరాజు మృత్యువుతో పోరాడుతున్నారు. చౌటుప్పల్ పోలీస్ ఇన్ స్పెక్టర్ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెం గ్రామానికి చెందిన నాగరాజు-సంతోష అనే దంపతులు చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం లోని ప్రభుత్వ పాఠశాలలో చదివే తన కూతురి వద్దకు బైకుపై వెళ్లారు. అనంతరం అదే బైకుపై చౌటుప్పల్ కు తిరిగి వస్తుండగా ధర్మోజీగూడెం శివారులోని వినాయకుని గుడి వద్దకు రాగానే వెనక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో నాగరాజు, సంతోష దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108 అంబులెన్సు కు సమాచారం అందించి చౌటుప్పల్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు ప్రథమ చికిత్సలు చేసిన వైద్యులు మెరుగైన చికిత్సల నిమిత్తం హయత్ నగర్ లోని సన్ రైజ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సంతోష అదేరోజు రాత్రి మృతి చెందింది. ఆమె భర్త నాగరాజు మృత్యువుతో పోరాడుతున్నాడు. మృతురాలు బంధువులు శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ ఐ కృష్ణమాల్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.






