- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ గ్రామపంచాయతీ కార్యదర్శి ఎక్కడ..?
గ్రామాలలో ప్రజా సమస్యలు పేరుకు పోతున్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించి గ్రామ సర్పంచులను ఏర్పాటు చేసింది.

దిశ, మఠంపల్లి : గ్రామాలలో ప్రజా సమస్యలు పేరుకు పోతున్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించి గ్రామ సర్పంచులను ఏర్పాటు చేసింది. సర్పంచులు అందుబాటులోకి వచ్చిన ఆ సర్పంచ్ కి అందుబాటులో ఉండాల్సిన పంచాయతీ కార్యదర్శులు అందుబాటు లేకపోవడంతో సమస్యలు అలాగే పేరుకుపోతున్న పరిస్థితి సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల పరిధిలోని రఘునాథపాలెం నెలకొంది. ఈ గ్రామంలో గ్రామ పాలన వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన గ్రామపంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్ నాయక్ అందుబాటులో లేకపోవడం గమనార్హం.
ప్రజలకు అందుబాటులో లేని కార్యదర్శి
మఠంపల్లి మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా లీవ్ లెటర్ కూడా ఇవ్వకుండా తనకు ఇష్టం వచ్చినట్టుగా గత పది రోజులుగా విధులకు హాజరుకాలేదని స్థానికంగా తెలిసిన సమాచారం. ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత కలిగిన గ్రామపంచాయతీ కార్యదర్శి ఇలాంటి నిర్లక్ష్య ధోరణి అవలంబించడం ప్రజాస్వామ్య పాలనపై ప్రతికూల ప్రభావం చూపుతోందని గ్రామ యువత అభిప్రాయపడుతోంది. ఈ నిర్లక్ష్యంపై సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని రఘునాథపాలెం గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పంచాయతీ కార్యదర్శి పై ప్రజల ఆగ్రహం
గ్రామపంచాయతీ కార్యదర్శి అనేది ప్రజలకు సేవ చేసే కీలక పదవి. అయితే బాధ్యతాయుతమైన ఈ పదవీలో ఉండి ఎంపీడీవో అనుమతి లేకుండా విధులు వదిలివేయడం తీవ్ర నిర్లక్ష్యంగా ప్రజలు భావిస్తున్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు అవసరమైన పరిపాలనా సూచనలు ఇవ్వాల్సిన కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో గ్రామ పాలనలో అయోమయం నెలకొంది. సంక్రాంతి పండుగ సమీపిస్తున్నప్పటికీ ఇతర గ్రామాల్లో వీధి దీపాలు వెలుగులతో మెరిసిపోతుండగా.. రఘునాథపాలెం గ్రామంలో వీధి దీపాల మరమ్మత్తులు పూర్తిగా నిలిచిపోయాయి. వీధి దీపాలు మరమ్మత్తులు చేయించాల్సిన బాధ్యత కార్యదర్శిదే అయినప్పటికీ ఆయన నిర్లక్ష్యం వల్ల గ్రామం చీకట్లో మగ్గుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పది రోజులు విధులు కాదని రావడం లేదు : మఠంపల్లి ఎంపీడీఓ జగదీష్
కార్యదర్శి విధులకు హాజరు కాకుండా పది రోజులుగా రావడం లేదు. ముందస్తు సమాచారం లేకుండా లీవ్ లెటర్ కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కార్యదర్శి లక్ష్మణ్ నాయక్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదని అధికారులు తెలిపారు.






