- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓ వ్యక్తిపై అనుమానం వచ్చి.. పోలీసులు విచారించగా..
ఎస్ఐ ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురిని బురిడీ కొట్టించిన నకిలీ డీఎస్పీని సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ,సూర్యాపేట: ఎస్ఐ ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురిని బురిడీ కొట్టించిన నకిలీ డీఎస్పీని సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ నరసిoహ మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని స్థానిక 60 ఫీట్ రోడ్డు శ్రీ గ్రౌండ్ హోటల్ వద్ద ఓ వ్యక్తి అనుమానస్పదంగా కనిపించడంతో.. హోటల్ యాజమాన్యం ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని విచారించామన్నారు. అయితే అతని పేరు బత్తుల శ్రీనివాస్ అని తెలిసిందన్నారు. తానే డిఎస్పీగా వ్యవహరిస్తూ అమాయకమైన నిరుద్యోగులను పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, సివిల్ సప్లై లో ఉద్యోగం ఇస్తానని చెప్పి వారి వద్ద నుంచి డబ్బులు తీసుకొని తిరిగేవాడని తెలిపారు.
గతంలో మఠంపల్లి, రాజమండ్రి టూ టౌన్, నరసరావుపేట రూరల్, త్రిపురాoతకం, మేడికొండూరు, మార్కాపురం ఇలా వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలలో కేసులు అయ్యాయని ఎస్పీ తెలిపారు. కేసులలో జైలుకు వెళ్లి బెయిల్ పై వచ్చి మరల అదేవిధంగా వ్యవహరిస్తూ తిరిగేవాడానీ తెలిపారు. కోదాడ పట్టణంలోని నిరుద్యోగురాలికి ఉద్యోగం ఇప్పిస్తానని 36 లక్షలు వసూలు చేసినట్టుగా తెలిపారు. అలాగే ఇంకొంతమంది నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేసి గుంటూరులో ఫాచ్చునర్ కార్, ఇన్నోవా లాంటి లగ్జరీ కార్లతో సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ.. హోటలలో బస చేస్తూ జల్సాలకు తిరిగే వాడిని తెలిపారు. అతని నుంచి 18 లక్షల నగదు రూపాయలు, నలుపు రంగు మహేంద్ర కార్, పోలీస్ డ్రెస్, రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీసులకు రివార్డు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్పి నాగేశ్వరావు, డి.ఎస్.పి రవి, సీఐ రాఘవులు, ఎస్ ఐలు సైదులు,ఆంజనేయులు, ప్రవీణ్, ఏడుకొండలు, క్రైమ్ టీం విద్యాసాగర్ రావు,కృష్ణ, కరుణాకర్, సైదులు ,వీరయ్య, బజార్,మధు తదితరులు పాల్గొన్నారు






