రాష్ట్రంలో కావాల్సింది బార్లు కాదు బడులు..

by Disha Web Desk 11 |
రాష్ట్రంలో కావాల్సింది బార్లు కాదు బడులు..
X

దిశ, చిట్యాల: 'రాష్ట్రంలో పాఠశాలలు తొలగిస్తూ బార్లు, వైన్స్ లు ఏర్పాటుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్సాహం చూపుతోంది, రాష్ట్ర ప్రజలు తమ పిల్లల భవిష్యత్ కోసం కావాల్సినవి బార్లు కాదు బడులు కోరుకుంటున్నారు' అని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. సామాజిక న్యాయ సాధన కోసం ఆయన చేపట్టిన బీసీ విద్యార్థి యువజన పోరు యాత్ర గురువారం చిట్యాలకు చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణ కేంద్రంలోని కనకదుర్గ సెంటర్ లో ఉన్న మహనీయుల విగ్రహాలకు పూలమాలలేసి అనంతరం ఆయన మాట్లాడారు. బడుగు బహీనవర్గాల విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెరిగిన ధరల ప్రకారం స్కాలర్షిప్ గాని, ఫీజులు గాని పెంచడం లేదని, ప్రైవేటు యూనివర్సిటీలను తీసుకొచ్చి ప్రభుత్వ యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు ఉన్నత విద్య అందకుండా చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో 12 లక్షల మంది పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు3567లకు రూ. 67 కోట్ల ఫీజులు చెల్లించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఇంగ్లీష్ మీడియంలో బోధించే పాఠశాలలు కావాలని, మండలానికి ఒక గురుకులం కావాలని, నియోజకవర్గానికి ఉన్నత కాలేజీలు కావాలని, ప్రతి జిల్లాకు యూనివర్సిటీ కావాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీసీ నాయకులు ఎద్దుల పూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed