విదేశాలలో బీసీ సంఘం బలోపేతానికి కృషి చేస్తాం : దూదిగాని కిర‌ణ్ కుమార్

by Ratna Kumari |

దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : విదేశాలలో బీసీ సంఘం బలోపేతానికి కృషి చేస్తామని బీసీ ఎన్ఆర్ ఐ సెల్ అధ్యక్షులు దూదిగాని కిరణ్ కుమార్ అన్నారు. బీసీ ఎన్నారై సెల్ అధ్యక్షుడిగా బీసీ సంఘం

విదేశాలలో బీసీ సంఘం బలోపేతానికి కృషి చేస్తాం : దూదిగాని కిర‌ణ్ కుమార్
X

దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : విదేశాలలో బీసీ సంఘం బలోపేతానికి కృషి చేస్తామని బీసీ ఎన్ఆర్ ఐ సెల్ అధ్యక్షులు దూదిగాని కిరణ్ కుమార్ అన్నారు. బీసీ ఎన్నారై సెల్ అధ్యక్షుడిగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్న సందర్భంగా ఆయనకు నల్గొండ పట్టణంలోని న్యూ రాఘవేంద్ర కాలనీ వద్ద శనివారం సంఘం నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ నినాదాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేస్తామని అన్నారు. రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య సూచన మేరకు పనిచేస్తామన్నారు. తనను బీసీ ఎన్ఆర్ఐ సెల్ గా నియమించినందుకు ఆ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు గంజి రాజేందర్, గంజి వెంకన్న, కొండూరు సత్యనారాయణ, చెరుపెల్లి జయప్రకాష్, చింతల వెంకన్న, నాగరాజు, రాపోలు సాయి, మూడవేణు,రాంప్రసాద్, చెరుపల్లి రమేష్, జిల్లా చందు, రాపోలు భాను ప్రకాష్, శివ, కిరణ్ కుమార్ తల్లిదండ్రులు దూదిగాని రాములు, రాములమ్మ పాల్గొన్నారు.

Next Story