గ్రామీణ క్రీడాకారులకు అన్నివిధాల సహకారం అందిస్తాం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

by Ratna Kumari |

దిశ, నల్గొండ టౌన్ : గ్రామీణ క్రీడాకారులకు అన్నివిధాల సహకారం అందిస్తామ‌ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈనెల 28 నుంచి డిసెంబర్ 12 వరకు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో

గ్రామీణ క్రీడాకారులకు అన్నివిధాల సహకారం అందిస్తాం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
X

దిశ, నల్గొండ టౌన్ : గ్రామీణ క్రీడాకారులకు అన్నివిధాల సహకారం అందిస్తామ‌ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈనెల 28 నుంచి డిసెంబర్ 12 వరకు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే NPL-6 పోస్టర్ ను నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తో పాటు నిర్వాహకులతో కలిసి మంత్రి బుధవారం సెక్రటేరియట్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టోర్నమెంట్ కు అన్ని విధాలుగా సహకారం అందిస్తానని తెలిపారు. ఇలాంటి క్రీడలు గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. టోర్నమెంట్ పాల్గొనే విజేతలకు మొదటి బహుమతిగా Rs2,22,222, ద్వితీయ బహుమతి గా Rs. 1,11,111అందచేయ‌నున్న‌ట్టు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ కౌన్సిలర్లు ఆంగోతు ప్రదీప్ నాయక్,కేసాని వేణుగోపాల్ రెడ్డి, నిర్వాహకులు బోనగిరి ప్రభాకర్,ముత్తినేని నాగేశ్వరరావు,పాలకూరి శ్రీధర్, గంజి గిరి, కోమటిరెడ్డి శేఖర్ రెడ్డి,సాయి,చిన్ని రంగ, మధు, నవీన్ రెడ్డి, నాని పాల్గొన్నారు

Next Story