దేవరకొండను కొడంగల్ తరహాలో అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే బాలు నాయక్

by Ratna Kumari |

దిశ‌, దేవ‌ర‌కొండ టౌన్ : దేవరకొండ నియోజకవర్గాన్ని కొడంగల్ మాదిరిగానే సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని

దేవరకొండను కొడంగల్ తరహాలో అభివృద్ధి చేస్తాం :  ఎమ్మెల్యే  బాలు నాయక్
X

దిశ‌, దేవ‌ర‌కొండ టౌన్ : దేవరకొండ నియోజకవర్గాన్ని కొడంగల్ మాదిరిగానే సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ స్పష్టం చేశారు. నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డితో కలిసి ఆయ‌న నూత‌నంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను శాలువాలతో సత్కరించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ ప్రజలు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నిత్యం గ్రామాల్లో అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నూతన పాలకవర్గాలకు సూచించారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని, గుర్తింపును నిలబెట్టుకోవాలన్నారు. గ్రామాభివృద్ధితో పాటు పల్లెల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుందన్నారు. నియోజకవర్గంలోని మొత్తం 230 స్థానాలకు 180 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించగా.. కేవలం 50 స్థానాల్లోనే బీజేపీ, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని, ప్రజల సంతోషమే లక్ష్యంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేస్తున్నామని, మిగిలిన హామీలను కూడా త్వరలోనే నెరవేరుస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ ముక్క‌మ‌ల్ల వెంక‌ట‌య్య గౌడ్, కాంగ్రెస్ నాయ‌కులు వెంక‌ట‌య్య‌, గిరి యాద‌య్య‌, ముక్క‌మ‌ల్ల శ్రీను, నేరేడుగొమ్ము స‌ర్పంచ్ పులికంటి సుధాక‌ర్, ఉప స‌ర్పంచ్ ఎలిజ‌ర్ల శ్రీను త‌దిత‌రులు పాల్గొన్నారు.

Next Story