- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలి
నియోజకవర్గంలోని ఏ ఒక్క గ్రామంలో కూడా తాగునీటి సమస్య లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సూచించారు.

దిశ, మిర్యాలగూడ : నియోజకవర్గంలోని ఏ ఒక్క గ్రామంలో కూడా తాగునీటి సమస్య లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సూచించారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ కలిసి ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, ఇరిగేషన్, ఎలక్ట్రికల్, రెవిన్యూ, మండల పరిషత్, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా నీటి కొరత ఉన్న గ్రామాలను గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. మంచినీటి సమస్య లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు. గ్రామాలలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేయించనున్నట్లు తెలిపారు. అనంతరం దామరచర్ల మండలంలో ఇండియన్ సిమెంట్, అంబుజా సిమెంట్(పెన్నా) యాజమాన్యంతో సమావేశ నిర్వహించారు. సిమెంట్ ఫ్యాక్టరీ పరిసరాల్లో ఉన్న ప్రతీ గ్రామంలో త్రాగు నీటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఫ్యాక్టరీ యాజమాన్యం తీసుకోవాలని సూచించారు. గ్రామాలకు కావాల్సిన విద్య, వైద్యం మౌలిక వసతులు తమ సి ఎస్ ఆర్ ఫండ్స్ ద్వారా గ్రామాలకు అందజేయాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు. వాడపల్లి, ఇర్కిగూడెం, గణేష్ పాడ్, శూన్యంపాడు గ్రామాలలో త్రాగు నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆ గ్రామాలలో ఫ్యాక్టరీల సొంత ఖర్చులతో వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి గ్రామస్థులకు ఉచితంగా మంచినీటిని పంపిణీ చేయాలని అన్నారు. అధికారులతో కలసి వాడపల్లి మిషన్ భగీరథ ప్లాంట్ సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో తాసిల్దార్లు, ఎంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






