- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కృష్ణా నదిలో నీరు కలుషితం.. రంగంలోకి పరిశోధన బృందాలు
దిశ, మఠంపల్లి : సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల పరిధిలోని మట్టపల్లి సమీపంలో ప్రవహిస్తున్న కృష్ణా నది నీరు ఇటీవల కాలంలో తీవ్రంగా క

దిశ, మఠంపల్లి : సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల పరిధిలోని మట్టపల్లి సమీపంలో ప్రవహిస్తున్న కృష్ణా నది నీరు ఇటీవల కాలంలో తీవ్రంగా కలుషితమవ్వడం స్థానిక ప్రజల్లో ఆందోళనకు గురిచేస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు కృష్ణా నదిలో కెమికల్ పదార్థాలను కలిపిన కారణంగా నది నీటి రంగు, వాసన మారినట్టు స్థానికులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి CSIR–NEERI (సెంట్రల్ పొల్యూషన్ & ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ సంస్థ) కేంద్ర బృందం సైంటిస్టులు, నీటి పరిశోధన శాఖ,రీసెట్ ఇనిస్టిట్యూట్ సెంటర్, నీటి పరీక్ష ప్రత్యేక బృందాన్ని ఘటన స్థలానికి పంపించింది. బృందాలు కృష్ణానది వద్దకు చేరుకొని నీటి నమూనాలను సేకరించి శాస్త్రీయ పరీక్షలకు పంపించినట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత ఇరిగేషన్ ఎస్సీ నాగభూషణ్ మాట్లాడుతూ కృష్ణానది నీటిలో జరిగిన మార్పులపై ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుంటోంది. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దు. నది నీటిలో కలుషితం ఎంత మేరకు ఉందో,దానికి కారణాలు ఏమిటో శాస్త్రీయంగా నిర్ధారించిన తరువాత కఠిన చర్యలు తీసుకుంటాం అని ప్రజలకు వివరించారు.
మిషన్ భగీరథ ఇరిగేషన్ ఈఈ రామ్ కిషోర్, డీఈ వెంకటేశ్వర్లు, ఏఈఈ ఫయాజ్ అధికారులు పాల్గొని, నీటి పరీక్షల ప్రక్రియ, తీసుకుంటున్న జాగ్రత్తలు, భవిష్యత్ చర్యలపై ప్రజలకు స్పష్టంగా అవగాహన కల్పించారు. అవసరమైతే తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలు పుణ్యక్షేత్రాలకు ఈ ఘటన ప్రభావం చూపకుండా ఉండేందుకు పూర్తి స్థాయి పర్యవేక్షణ కొనసాగిస్తామని, కలుషితానికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నీటి పరీక్షల నివేదికలు వచ్చిన అనంతరం పూర్తి వివరాలను ప్రజలకు తెలియజేస్తామని అధికారులు తెలిపారు.






