స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్

by Ratna Kumari |

దిశ, కనగల్ : రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలందరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని ఎస్పీ శ‌ర‌త్ చంద్ర ప‌వార్ సూచించారు.

స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి :  ఎస్పీ శరత్ చంద్ర పవార్
X

దిశ, కనగల్ : రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలందరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని ఎస్పీ శ‌ర‌త్ చంద్ర ప‌వార్ సూచించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ముందస్తు భద్రత చర్యలలో భాగంగా మండలంలోని కనగల్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రవర్తనా నియమావళి పై గ్రామ ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, యువతకు ఎన్నికల నిబంధనలు, మార్గదర్శకాలపై ఆయ‌న‌ అవగాహన కల్పించారు. ఈ సంద‌ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సమయంలో ఇతరుల మనోభావాలు దెబ్బతీయకుండా వారి స్వేచ్చకు భంగం కలగకుండా ప్రచారం నిర్వహించుకోవాలన్నారు. ముఖ్యంగా యువత గొడవలలో పాల్గొని ఒక్క సారి కేసులు నమోదైతే వారు భవిష్యత్తులో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు అనర్హులవుతారని అలాగే ఇతర దేశాలకు కూడా వెళ్లలేరని తెలిపారు. ఎటువంటి గొడవలలో పాల్గొనకుండా గ్రామంలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకొనుటకు సహకరించాలని అన్నారు. ఇప్పటికే జిల్లాలో గత ఎన్నికలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిని బైండోవర్ చేయడం జరిగిందని వారిపై కదలికలపై నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు చేశారు.

ఎవ్వ‌రూ కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకుని దాడులకు గొడవలకు పాల్పడడం చేయకూడద‌న్నారు. ఎన్నికల సమయంలో అల్లర్లు, హింసాత్మక చర్యలు, ప్రతిష్టాభంగ ప్రచారాలు చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను అమలు చేస్తూ, ప్రచారాలు సమయంలో, పోలింగ్ ను ముందురోజు, పోలింగ్ రోజు, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేలా సహకరించాలన్నారు. ఎలాంటి చట్ట వ్యతిరేకమైన ఎన్నికల ఉల్లాంఘన చర్యలు జరిగిన వెంటనే డయాల్ 100, స్థానిక పోలీస్ కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు కోరారు. ఈ కార్యక్రమంలో చండూరు సీఐ కే.ఆదిరెడ్డి, కనగల్ ఎస్సై కే.రాజిరెడ్డి, గ్రామ ప్రజలు, యువత, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story