- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాలుగేళ్ల చిన్నారి పై అఘాయిత్యం
నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన 60 ఏళ్ల వ్యక్తిని భువనగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన 60 ఏళ్ల వ్యక్తిని భువనగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం పెంచికల్ పహాడ్ గ్రామానికి చెందిన నాలుగేళ్ల పసిపాపపై జరిగిన అమానుష ఘటన సమాజాన్ని తీవ్రంగా కలిచివేసింది. 60 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి చేసిన ఈ దారుణం మానవత్వానికే మచ్చగా మారింది. ఆడపిల్లలపై, ముఖ్యంగా చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాని పసిపిల్లలు ఆడుకుంటూ నవ్వుతూ ఉండాల్సిన వయసులో ఇలాంటి భయానక అనుభవాలు ఎదుర్కోవడం అత్యంత బాధాకరం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం పెంచికల్ పహడ్ గ్రామానికి చెందిన సిలివేరి ఎల్లయ్య ఇంటి పక్కన ఇంటిలో ఉన్న నాలుగు సంవత్సరాల పాపను మాయ మాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లి పాప పట్ల అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పాప ఏడ్చుకుంటూ వచ్చి జరిగిన విషయాన్ని నానమ్మకు చెప్పడంతో బాధితురాలు నాయనమ్మ భువనగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పాపకు మెరుగైన చికిత్సకు నిమిత్తం భువనగిరి జిల్లా ఆసుపత్రికి తరలించారు. నిందితుని అదుపులో తీసుకొని విచారణ చేపట్టి నిందితుడి పైన ఫాక్స్ కో, రేప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి రూరల్ ఎస్ హెచ్ ఓ అనిల్ కుమార్ తెలిపారు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన సిలువేరు ఎల్లయ్యను ఉరితీయాలంటూ భువనగిరి ప్రిన్స్ చౌరస్తా వద్ద బుధవారం గ్రామస్తులు, బంధువులు రాస్తారోకో నిర్వహించారు. చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తికి ఉరిశిక్ష సరియైన శిక్ష అని ఉరితీయాలని కోరారు. మా యొక్క పాపకు మాయ మాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






