చ‌ట్టాన్ని అతిక్ర‌మిస్తే.. క‌ఠిన చ‌ర్య‌లు : ఎస్పీ న‌ర‌సింహ

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-12-12 11:14:52  IST  )

దిశ, చింతలపాలెం : ఎన్నిక‌ల స‌మ‌యంలో చ‌ట్టాన్ని అతిక్ర‌మిస్తే. క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఎస్పీ న‌ర‌సింహ పేర్కొన్నారు.

చ‌ట్టాన్ని అతిక్ర‌మిస్తే.. క‌ఠిన చ‌ర్య‌లు :  ఎస్పీ న‌ర‌సింహ
X

దిశ, చింతలపాలెం : ఎన్నిక‌ల స‌మ‌యంలో చ‌ట్టాన్ని అతిక్ర‌మిస్తే.. క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఎస్పీ న‌ర‌సింహ పేర్కొన్నారు. శుక్ర‌వారం చింతలపాలెం జిల్లా ప‌రిష‌త్ ఉన్నత పాఠశాలలో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సూర్యాపేట ఎస్పీ నరసింహ సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి (MCC) పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూఎన్నికల సమయంలో ఏ పార్టీ, ఏ అభ్యర్థి అయినా చట్టాన్ని అతిక్రమించే చర్యలు చేస్తే పోలీసులు ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. ఎస్పీ వివరించిన ప్రధాన సూచనలు హెచ్చరికలు డబ్బు, మద్యం, బహుమతులు పంపిణీ చేస్తే వెంటనే కేసులు నమోదవుతాయని తెలిపారు. రాత్రి వేళల్లో అనవసరంగా గుంపులు తిరగడం, క్యాంపులు ఏర్పాటు చేయడం, ఓటర్లపై ఒత్తిడి చేయడం చేసిన వారిపై బైండోవర్ చర్యలు, నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం, ప్రతిష్ట దెబ్బతీయే పోస్టులు చేస్తే IT Act కింద కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎన్నికల పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో ప్రచారం చేస్తే.. తక్షణమే అరెస్టులు చేపట్టనున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యక్తులను ముందుగానే గుర్తించి నిర్బంధ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పాక్షికంగా జరుగేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని, అభ్యర్థులు, కార్యకర్తలు చట్టాలను గౌరవించాలని, లేకపోతే చట్టం ముందు ఎవరైనా సమానమే అని ఎస్పీ స్పష్టం చేశారు. వారి వెంట డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ ప్రతాప్ లింగం, చింతలపాలెం ఎమ్మార్వో సురేందర్ రెడ్డి, ఎంపీడీవో రామచంద్రరావు, ఎంపీవో భూపాల్ రెడ్డి, ఎస్సై సందీప్ రెడ్డి, పరమేష్, గ్రామపంచాయతీ కార్యదర్శి నాగుల్ మీరా, లైన్ మేన్ వీరబాబు పాల్గొన్నారు.

Next Story