- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయస్థాయి అర్హత పరీక్షలో పల్లెవాసి విజయం
by Ratna Kumari |
జాతీయ స్థాయి అర్హత పరీక్షలో పల్లెవాసి విజయం సాధించారు. వరుస అర్హత పరీక్షల్లో విజయం సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు.

X
దిశ, చందంపేట : జాతీయ స్థాయి అర్హత పరీక్షలో పల్లెవాసి విజయం సాధించారు. వరుస అర్హత పరీక్షల్లో విజయం సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం పడమటిపల్లి గ్రామానికి చెందిన పల్లె కృష్ణయ్య కుమారుడు నాగార్జున. జాతీయస్థాయి అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి తాను పుట్టిన గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. ఇటీవల నిర్వహించిన UGC–NEET పరీక్షల్లో ఇంగ్లీష్ విభాగంలో అర్హత సాధించాడు నాగార్జున. ఇక ఇప్పటికే 2023లో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన SET పరీక్షలో కూడా ఉత్తీర్ణత పొందడం విశేషం. ఈ సందర్భంగా నాగార్జున సాధించిన విజయానికి మిత్రులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయస్థాయిలో విజయాన్ని అందుకోవడం ఇతర యువతకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొంటున్నారు.
Next Story






