గోవులను తరలిస్తున్న వాహనం పట్టివేత

by velandi.Saikiran |

హైదరాబాద్ లోని బహదూర్పుర కబేలాకు అక్రమంగా తరలిస్తున్న 11 గోవులను పోచంపల్లి పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. స్థానిక

గోవులను తరలిస్తున్న వాహనం పట్టివేత
X

దిశ, భూదాన్ పోచంపల్లి: హైదరాబాద్ లోని బహదూర్పుర కబేలాకు అక్రమంగా తరలిస్తున్న 11 గోవులను పోచంపల్లి పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. స్థానిక ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తునికి చెందిన ఆవల నానాజీ, రుత్తల రమేష్, గోళ్ళు వెంకటరమణలు 11 గోవులతో మహేంద్ర బొలెరో వాహనంలో మండలంలోని పెద్ద రావులపల్లి మీదుగా వెళ్తున్నారని విశ్వసనీయ సమాచారంతో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పెద్ద రావులపల్లి గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న 11 గోవులను గుర్తించి, ఇట్టి గోవులను రాజపేట మండలం చల్లూరు లోని సహాయోగ నందిషాల గోశాలకు తరలించినట్లు తెలిపారు. అనంతరం ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు.

Next Story