మండలానికి కొత్త ఎస్సై.. బాధ్యతలు చేపట్టిన వాస ప్రవీణ్

by Bhanu |

నూతనకల్ మండల నూతన ఎస్సైగా వాస ప్రవీణ్ కుమార్ ఆదివారం విధుల్లో చేరారు.

మండలానికి కొత్త ఎస్సై.. బాధ్యతలు చేపట్టిన వాస ప్రవీణ్
X

దిశ, నూతనకల్ : నూతనకల్ మండల నూతన ఎస్సైగా వాస ప్రవీణ్ కుమార్ ఆదివారం విధుల్లో చేరారు. సూర్యాపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి బదిలీపై వచ్చిన ఆయన, ఇక్కడ పని చేసిన మహేంద్రనాథ్ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఎస్సై ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, మండలంలో శాంతిభద్రతలు పరిరక్షించడంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.


ప్రజల ఫిర్యాదులపై త్వరితగతిన స్పందిస్తూ, న్యాయం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చట్టానికి విరుద్ధంగా వ్యవహరించకుండా చూసేందుకు పోలీసు శాఖ కట్టుబడి ఉందని తెలిపారు. పౌరులతో సమన్వయం పెంచుకుని మండలాన్ని శాంతియుతంగా తీర్చిదిద్దేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఆయన తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్సైకి స్టేషన్ సిబ్బంది పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.




Next Story