కృష్ణా జలాలలో తెలంగాణకు అన్యాయం.. గత ప్రభుత్వం వల్లే : మంత్రి ఉత్తమ్

by Bhanu |

కృష్ణ జలాల నీటి వాటాల పంపకాలలో గతంలో 811 టీఎంసీలకు కేటాయింపులో ఆంధ్రాకు 512 టీఎంసీలు తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారని దీనివలన తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని గత పదేళ్లు పాలన చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం నీటి పంపకాలలో ఏనాడు కొట్లడ లేదని వారు కేటాయించిన 299 టీఎంసీల నీరు సరిపోతాయని అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం లిఖిత పూర్వకంగా రాసి రాశి ఇచ్చి తెలంగాణకు నష్టం చేశారని రాష్ట్ర నీటిపారుదల పౌరసరపాల శాఖ మంత్రి ఎన్ . ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.

కృష్ణా జలాలలో తెలంగాణకు అన్యాయం.. గత ప్రభుత్వం వల్లే : మంత్రి ఉత్తమ్
X

దిశ, హుజూర్ నగర్: కృష్ణ జలాల నీటి వాటాల పంపకాలలో గతంలో 811 టీఎంసీలకు కేటాయింపులో ఆంధ్రాకు 512 టీఎంసీలు తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారని దీనివలన తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని గత పదేళ్లు పాలన చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం నీటి పంపకాలలో ఏనాడు కొట్లడ లేదని వారు కేటాయించిన 299 టీఎంసీల నీరు సరిపోతాయని అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం లిఖిత పూర్వకంగా రాసి రాశి ఇచ్చి తెలంగాణకు నష్టం చేశారని రాష్ట్ర నీటిపారుదల పౌరసరపాల శాఖ మంత్రి ఎన్ . ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని అంజని సిమెంట్ ఫ్యాక్టరీలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా జలాల పంపకంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తమ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి కలిసి మేమంతా చర్చించి కృష్ణ బోర్డు ట్రిబ్యునల్ లో తెలంగాణ రాష్ట్ర జనాభా సాగు అయ్యే భూమి వీటన్ని అంశాలను వారికి వివరించి 70 శాతం తెలంగాణ కేటాయించాలని... ఆంధ్రకు 30 శాతం కేటాయించాలని తనే స్వయంగా కృష్ణ బోర్డు ట్రిబ్యునల్ కు వెళ్లి పోరాటం చేస్తున్నామన్నారు.


గతంలో పాలమూరు రంగారెడ్డి నీటి పంపకాల కేటాయింపులు జరగలేదన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తుమ్మడి హట్టి వద్ద డిజైన్ అయినా చేవెళ్ల - ప్రాణహిత ప్రాజెక్టు 38 వేల కోట్లతో పూర్తయ్యదని... కానీ దానిని టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక డిజైన్ స్థలం మార్చి మేడిగడ్డ వద్ద లక్ష కోట్లతో కాలేశ్వరం ప్రాజెక్టు కట్టారని.. అదే హయాంలో కాలేశ్వరం కూలిపోయిందని అన్నారు. దీనివలన 62 వేల కోట్ల నష్టం వాటిలిందన్నారు.కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం జరిగాయని విమర్శించారు. ఈ లక్ష కోట్లు ఖర్చుపెడితే కృష్ణా నదిపై అనేక ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చునని చెప్పారు. కృష్ణ నదిపై ఏర్పాటు చేసే ప్రాజెక్టులన్ని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.

Next Story