- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
33.83 కోట్లతో బెట్టేతండా లిఫ్ట్.. 2140 ఎకరాల భూమికి సాగు నీరు : మంత్రి ఉత్తమ్
పాలకవీడు మండలంలోని బెట్టేతండా గ్రామ శివారులోని ముసీ నదిపై 33.83 కోట్లతో నిర్మాణ పనులను రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు.

దిశ, హుజూర్ నగర్: పాలకవీడు మండలంలోని బెట్టేతండా గ్రామ శివారులోని ముసీ నదిపై 33.83 కోట్లతో నిర్మాణ పనులను రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. జరుగుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఆదివారం పాలకవీడు మండలంలోని బెట్టేతండా లిఫ్ట్ అలాగే కృష్ణా నదిపై జాన్ పహాడ్ శివారులో జాన్ పహాడ్ జవహర్ లిఫ్టు జరుగుతున్న లిఫ్ట్ పనులను ఆయన ఎమ్మెల్సీ రమావత్ శంకర్ నాయక్ తో కలిసి పరిశీలించారు.
33.83 కోట్లతో బెట్టేతండా లిఫ్ట్..
పాలకవీడు మండలంలోని ముసినదిపై బెట్టేతండా గ్రామ శివారులో 33.83 కోట్లతో ఏర్పాటు చేస్తున్న లిఫ్ట్ వలన బెట్టేతండా పాడ్య తండా సజ్జపురం గ్రామాల్లోని 2041 ఎకరాల భూమికి సాగునీరు అందుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.దీనివలన 2176 రైతులకు మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఒక్కొక్క ఎకరానికి లక్ష 66వెయిల రూపాయలను ఖర్చు చేస్తుందన్నారు. ఈ లిఫ్టు పనులు పూర్తి అయితే 1877 గిరిజన రైతులకు 34 మంది ఎస్సీ, 168 మంది బీసీ , 97 మంది ఓసి రైతుల భూములకు సాగునీరు చేరుతుందన్నారు. ఇప్పటికే భూ సేకరణ పూర్తి అయిందని భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం కూడా అందించడం జరిగిందని తెలిపారు. ఈ లిఫ్టు పనులను ఆగస్టు వరకు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ హనుమంత రావుకు ఆదేశించారు. పనులలో జాప్యం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. బెట్టేతండా చెక్ డాం కూడా అవసరం ఉందని గుర్తించామని వాటికి సంబంధించిన పనులకు ప్రతిపాదనలు తయారుచేసి త్వరగా పంపించాలని ఇరిగేషన్ సిఈ రమేష్ బాబుకు ఆదేశించారు.
జాన్ పహాడ్ జవహర్ లిఫ్టు పనులపై మంత్రి అసంతృప్తి..
కృష్ణా నదిపై జాన్ పహాడ్ శివారులో 273 కోట్లతో జాన్ పహాడ్ జవహర్ లిఫ్టు జరుగుతున్న లిఫ్ట్ పనులను పరిశీలించిన ఆయన అసంతృప్తి వ్యక్తం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత జనవరి నెలలో ఇక్కడికి వచ్చి పనులు పరిశీలించినప్పుడు ఆగస్టు వరకు పూర్తి చేస్తామని చెప్పినా మెగా కంపెనీకి చెందిన కాంట్రాక్టర్ ఆ పనులలో పురోగతి చూపించకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. నేను ఇలా రావడం ఇది మూడోసారి వస్తున్న పెద్దగా ప్రోగ్రెస్ కనిపించడం లేదని .. ఇక్కడ మిషన్ కూడా లేవు పని ఎక్కడా జరిగినట్టు కనిపించడం లేదన్నారు.ఈరోజు నేను ఇక్కడికి వస్తూ ఉన్నానని తెలిసి కూడా కాంట్రాక్టర్ శ్రీనివాస్ రాకపోవడం ఏంటి అంటూ ప్రశ్నిస్తూనే కాంట్రాక్టర్ శ్రీనివాస్ కు నీటిపారుదల సిఈ రమేష్ బాబుకు పనులు ఇలా జరిగితే కుదరదు అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ లిఫ్టు పూర్తయితే 13 గ్రామాలకు చెందిన రైతుల భూములకు 5600 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అలాగే పైప్ లైన్ కోసం 12 ఎకరాల భూమి అదనంగా భూ సేకరణ చేయబడిందని వాటికి సంబంధించి రైతులకు డబ్బులు కూడా ప్రభుత్వం అందించిందని తెలిపారు. నవంబర్ నాటికి పూర్తి చేసి అందించాలని కాంట్రాక్టర్ తో పాటు ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. అలాగే ఇక్కడ జరుగుతున్న పనులపై మంత్రి ఉత్తమ్ కాంట్రాక్టర్ శ్రీనివాస్ కు ఫోన్లో మెసేజ్ ద్వారా గా సమాచారం అందించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రమావత్ శంకర్ నాయక్ ఆర్డీఓ శ్రీనివాసులు ఇరిగేషన్ సీఈ రమేష్ బాబు డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి ఇరిగేషన్ ఎస్ ఈ శివధర్మ తేజ ఈఈ లు రామకృష్ణ సత్యనారాయణ సీఐ చరమండరాజు తాసిల్దార్ కమలాకర్ మాజీ ఎంపీపీ భూక్య గోపాల్ ,మాజీ జెడ్పిటిసి మాలోత్ బుజ్జి మోతిలాల్ మండల పార్టీ అధ్యక్షులు సుబ్బారావు బెల్లంకొండ నరసింహరావు చక్రధరరావు శివరాం పాల్గొన్నారు.
- Tags
- Uttam Kumar Reddy
- Palakeedu
- Bette Thanda Lift
- Jawahar Lift Project
- Musi River
- Krishna River
- Irrigation Projects Telangana
- Farmer Irrigation Benefit
- Contractor Warning
- Telangana Irrigation Minister
- Ramavath Shankar Naik
- Water Resources Development
- Johnpahad Lift Works
- CE Ramesh Babu
- Rural Development
- Telangana Farmers






