అక్రమాల వెంచర్ ఉషోదయం.. సబ్ కలెక్టర్ కు స్దానికుల ఫిర్యాదు

by Bhanu |

గ్రామీణా ప్రాంతాల లో ఏర్పాటు చేస్తున్న వెంచర్ల లో అక్రమాలకు నిలయంగా మారుతున్నాయి.

అక్రమాల వెంచర్ ఉషోదయం.. సబ్ కలెక్టర్ కు స్దానికుల ఫిర్యాదు
X

దిశ, మిర్యాలగూడ టౌన్ : గ్రామీణా ప్రాంతాల లో ఏర్పాటు చేస్తున్న వెంచర్ల లో అక్రమాలకు నిలయంగా మారుతున్నాయి. నామమాత్రపు అనుమతులు తీసుకొని భూములను కబ్జా చేస్తున్నారు.కొట్ల రూపాయాల విలువ చేసే భూములపై రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లేక అక్రమణలకు గురైతున్నాయి.

ఆక్రమణ భూములే :

మిర్యాలగూడ మండల పరిధిలోని శ్రీనివాస్ నగర్ , దుబ్బతండా రెవెన్యూ శివారులో గల సర్వే నెంబర్ 227 , 230,231,234,235,236,237 ల లో సుమారు 30 ఎకరాల లో ఉషోదయ టౌన్ షిప్ పేరుతో వెంచర్ ను ఏర్పాటు చేస్తున్నారు. అయితే రైతుల నుంచి భూములు కొనుగొలు చేసిన వెంచర్ యాజమాన్యం కొంత భూమిని అక్రమణ చేసుకున్నట్లు స్దానికులు సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు కూడా చేశారు. పలు సర్వే నెంబర్ల లో ప్రభుత్వ మిగులు భూమి ఉన్నట్లు స్దానికులు ఆరోపిస్తున్నారు. సుమారు 1.20 ఎకరాముల భూమి అక్రమించి వెంచర్ నిర్మాణం చేస్తున్నారు. వెంచర్ నిర్మాణంలో భాగంగా గ్రామ పంచాయితీకి 10శాతం రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉండగా శ్రీనివాస నగర్ పంచాయితీలో 14 ఎకరాలకు మాత్రమే అనుమతి తీసుకున్నట్లు పంచాయితీ అధికారులు పేర్కొంటున్నారు .దుబ్బతండా పరిధిలో 4 ఎకరాలకు భూమి మాత్రమే అనుమతికి ధరఖాస్తు చేసుకున్నారని ఆ గ్రామ పంచాయితీ కార్యదర్శి సుచరిత తెలిపారు. కానీ పంచాయితీకి ఎలాంటి భూమి రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు. ఎక్కువ మొత్తంలో భూములు కొనుగొలు చేసి అనుమతికి తక్కువ భూములు చూపుతున్నారని తెలుస్తొంది.

ఎన్ ఎస్పీ కాల్వ మాయం :

శ్రీనివాస్ నగర్ లో నిర్మాణం జరుగుతున్న ఉషోదయ టౌన్ షిప్ యాజమాన్యం ఎన్ ఎస్ పి కాల్వను మాయం చేశారు. సాగునీరు అందించేందుకు నిర్మించిన కాల్వ అనవాలు లేకుండా చేశారు. దీంతో సాగుభుములకు నీరందే పరిస్ధితి లేదని రైతులు వాపోతున్నారు. వెంచర్ లోపల నుంచి దీరవత్ తండాలో ఉన్న చెరువుకు ఈ కాల్వ ద్వారానే నీరందుతుంది. కానీ వెంచర్ వేయడం వలన చెరువులోకి నీరు రాకుండా అయింది. ఈ విషయం ఎన్ ఎస్ పి అధికారులకు తెలిసిన తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి కాల్వను పునరుద్దరించాలని రైతులు కోరుతున్నారు.

సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు :

ఉషోదయ వెంచర్ లో ఆక్రమణ భూముల విషయమై స్దానికులు గత ఏడాది సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ కు ఫిర్యాదు చేశారు. సబ్ కలెక్టర్ స్పందించి ఎన్ ఎస్ పి , రెవెన్యూ అధికారులతో జాయింట్ విచారణ జరపాలని ఆదేశించారు. కానీ అధికారులు నామ మాత్రంగా విచారణ జరిపి చేతులు దులుపుకున్నారని విమర్శలు ఉన్నాయి. కనీసం సర్వే కూడా నిర్వహించలేదని స్దానికులు పేర్కొంటున్నారు .అయితే ఎన్ ఎస్ పి కాల్వ కూడా అధికారులకు కనపడకపోవడం గమన్హరం.

అండ దండాలున్నాయని బెదిరింపులు :

జిల్లాలో పేరున్న ఓ ప్రజాప్రతినిధి అండ దండాలున్నాయని పేర్లు చెబుతూ ఉషోదయ యాజమాన్యం ఫిర్యాదుదారలను బెదిరింపుచర్యలకు పాల్పడుతున్నారని రైతులు పేర్కొంటున్నారు . కొంతమందికి పోలీసులతో ఫోన్ చేయించి వెంచర్ విషయంలో జోక్యం చేసుకొవద్దని చెప్పించారని సమాచారం. కొనుగొలు సమయంలో ఒక విధంగా కొనుగొలు చేశాక మరోవిధంగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు వాపోతున్నారు. తమ సంస్దకు చెందిన సర్వేయర్లతో సర్వే చేయించి తక్కువ భూములున్నట్లు చూపి ఎకరానికి 3 గుంటలు తక్కువ కు డబ్బులు చెల్లించినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. కానీ రికార్దు ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని విమర్శిస్తున్నారు. మిగితా డబ్బుల గురించి అడిగితే బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.


Next Story