లోక్ అదాల‌త్ ను వినియోగించుకోండి : ఎస్సై సైదులు

by Ratna Kumari |

కొట్టుకుంటే ఒక్కరే గెలుస్తారని, రాజీ పడితే ఇద్దరూ గెలిచినట్లేనని.. రాజీ మార్గమే రాజమార్గమని,లోక్ అదాలత్ ద్వారా సమన్యాయం సత్వర పరిష్కారం జరుగుతుందని శాలిగౌరారం ఎస్ఐ డి. సైదులు బుధవారం ఓ ప్రకటన లో తెలిపారు.

లోక్ అదాల‌త్ ను వినియోగించుకోండి : ఎస్సై సైదులు
X

దిశ, శాలిగౌరారం : కొట్టుకుంటే ఒక్కరే గెలుస్తారని, రాజీ పడితే ఇద్దరూ గెలిచినట్లేనని.. రాజీ మార్గమే రాజమార్గమని,లోక్ అదాలత్ ద్వారా సమన్యాయం సత్వర పరిష్కారం జరుగుతుందని శాలిగౌరారం ఎస్ఐ డి. సైదులు బుధవారం ఓ ప్రకటన లో తెలిపారు. ఈనెల 28న నల్గొండ జిల్లా లోని అన్ని కోర్టులలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను కక్షి దారులు సద్విని చేసుకోవాలని కోరారు. రాజీ పడదగిన కేసులో క్రిమినల్ సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు,కుటుంబ పరమైన నిర్వహణ కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంక్ రికవరీ చెక్ బౌన్స్ కేసులో కక్షి దారులు రాజీ పడాలని సూచించారు. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృధా చేసుకోవద్దని సూచించారు. జ్యుడీషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Next Story