ఇంకా తప్పని యూరియా కష్టాలు.. రైతన్నలు రోడ్లపై ధర్నా చేస్తున్న పట్టించుకోని పాలక ప్రభుత్వం

by Nalla Sampath Reddy |

కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఇంకా తప్పని యురియా కష్టాలు అని కొండమల్లేపల్లి సాగర్ జాతీయ రహదారిపై మండల చుట్టుపక్క ప్రాంత రైతన్నలు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది.

ఇంకా తప్పని యూరియా కష్టాలు.. రైతన్నలు రోడ్లపై ధర్నా చేస్తున్న పట్టించుకోని పాలక ప్రభుత్వం
X

దిశ, కొండమల్లేపల్లి: కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఇంకా తప్పని యురియా కష్టాలు అని కొండమల్లేపల్లి సాగర్ జాతీయ రహదారిపై మండల చుట్టుపక్క ప్రాంత రైతన్నలు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఇలా ఎన్ని మార్లు ధర్నాలు చేసిన ప్రభుత్వం మాత్రం పట్టించుకునే పాపాన పోతలేదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యం చూపు చూస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంలో రైతుల పాత్ర ఏమాత్రం లేదా అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్న కూడా కనీసం కన్నెత్తి చూడని వైనం రాష్ట్ర ప్రభుత్వానిది. రైతు కుటుంబం అని చెప్పుకునే ముఖ్యమంత్రి కూడా ఈ రైతుల గురించి ఆలోచిస్తలేరని రైతన్నలు ధర్నాలో వాపోతున్నారు. తక్షణ పరిష్కారం కై వెంటనే రైతన్నలకు కావలసిన యూరియా బస్తాలని ప్రభుత్వం అందజేసి ఈ యొక్క రైతన్నల బాధని తీర్చాలని కోరుతున్నారు. మరికొందరు రైతన్నలు వచ్చే స్థానిక ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకొని మా దగ్గరికి వస్తారని ఆరోపిస్తున్నారు. తక్షణ పరిష్కారం కై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రైతులకి యూరియా బస్తాలు అందజేయాలని కోరుకుంటున్నారు.

Next Story