- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూరియా కా రైతులు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ లో బుక్ చేసుకోవాలి : తహశీల్దార్
దిశ, శాలిగౌరారం : యూరియా కావాల్సిన రైతులందరూ తప్పనిసరిగా ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ లో బుక్ చేసుకోవాలని శాలిగౌరారం తహశీల్దార్ బిట్ల వరప్రసాద్ మండలంలోని రైతాంగానికి సూచించారు.

దిశ, శాలిగౌరారం : యూరియా కావాల్సిన రైతులందరూ తప్పనిసరిగా ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ లో బుక్ చేసుకోవాలని శాలిగౌరారం తహశీల్దార్ బిట్ల వరప్రసాద్ మండలంలోని రైతాంగానికి సూచించారు. బుధవారం మండల పరిధిలోని పెర్కకొండారం గ్రామంలోని అగ్రోస్ ఎరువుల దుకాణాన్ని తహసిల్దార్ వర ప్రసాద్ తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ తీసుకొచ్చిన ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ పైన రైతులకు తహశీల్దార్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ యూరియా కావాల్సిన రైతులు కచ్చితంగా ఈ యాప్ లో బుక్ చేసుకుని మాత్రమే సంబంధిత డీలర్ దగ్గరికి వెళ్లాలని సూచించారు. బుక్ చేసుకున్న రైతుకు తాను బుకింగ్ ఐడి తో పాటు ఎప్పటి వరకు బస్తాలు తీసుకోవచ్చు అనేది సంక్షిప్తంగా మెసేజ్ ద్వారా తెలియపరచడం జరుగుతుందని యాప్ లో ఏమైనా సందేహాలు ఉన్నచో వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని తెలిపారు.






