- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గురుకుల టీచర్ల సమస్యలను పరిష్కరించేలా యూనియన్లు సహకరించాలి : రాష్ట్ర ప్రతినిధి కొండ్రపల్లి శ్రీను
దిశ, చందంపేట: గురుకుల టీచర్ల సమస్యలను పరిష్కరించడానికి సంఘటితంగా అన్ని టీచర్స్ యూనియన్స్ కలిసికట్టుగా రావాలని, సమిష్టిగా పోరాటం చేయాలని దేవరకొండ మండల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో

దిశ, చందంపేట: గురుకుల టీచర్ల సమస్యలను పరిష్కరించడానికి సంఘటితంగా అన్ని టీచర్స్ యూనియన్స్ కలిసికట్టుగా రావాలని, సమిష్టిగా పోరాటం చేయాలని గురుకుల టీచర్ల రాష్ట్ర ప్రతినిధి కొండ్రపల్లి శ్రీను తెలిపారు. శుక్రవారం దేవరకొండ మండల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో యూటీఫ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం లో గురుకుల టీచర్ల రాష్ట్ర ప్రతినిధి కొండ్రపల్లి శ్రీను మాట్లాడుతూ టీచర్ల ప్రధాన సమస్యలను సమావేశంలో లేవనెత్తారు. అనుకులంగా ఉన్న ప్రస్తుత గురుకుల టైం టేబుల్ మార్చాలని, మహాత్మ జ్యోతి భాపులే బీసీ గురుకుల పాఠశాల లో రాత్రి విధుల్లో సెలవు రోజులలో ఇద్దరు టీచర్లనే కేటాయించాలని, 010 పద్దు కింద వేతనాలు ఇవ్వాలని, హెల్త్ కార్డ్స్, గెజిటెడ్ హోదా,కేర్ టేకర్స్, రెండవ శనివారం సెలవు, హాఫ్ లీవ్స్ మంజూరు, అలాగే ఔట్ సోర్సింగ్ గెస్ట్ టీచర్లుగా విధులు నిర్వహిస్తున్న వారికి 12 నెలల గౌరవప్రదమైన వేతనం అందించాలని ఆయన కోరారు. 24 గంటలు ఎల్లవేళలా విద్యార్థులకు అండగా అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న గురుకుల టీచర్ల శ్రమను గుర్తించి వెంటనే వారి ప్రధానమైన సమస్యలైనా అన్నిటినీ దశల వారిగా పరిష్కరించేలా టీచర్స్ యూనియన్స్ సహకరించాలని మొదటగా ఆర్థికేతర అంశమైన ప్రస్తుత టైం టేబుల్ వెంటనే మార్చాలని కొండ్రపల్లి శ్రీను కోరారు. దీనికి యూటీఎఫ్ నాయకత్వం వెంటనే స్పందిస్తూ అతి త్వరలోనే గురుకుల టైం టేబుల్ మార్చేల మరియు వివిధ సమస్యలని తస్లవారీగా పరిష్కరించే పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీని కోసం నేను కృషి చేస్తున్నానని.. మార్చేలా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో గురుకుల టీచర్స్ రాంబాబు, సంజీవయ్య, రమేష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.






