- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుర్తు తెలియని వ్యక్తి మృతి.. మఠంపల్లి లో కలకలం
by Bhanu |
మఠంపల్లి మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కలకలం రేపింది.

X
దిశ, మఠంపల్లి : మఠంపల్లి మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. యాదాద్రి టౌన్షిప్ సమీపంలోని కంపచెట్లలో ఈ ఘటన సాయంత్రం ఐదు గంటల సమయంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మృతుడు సుమారు 35 సంవత్సరాల వయస్సు కలిగి ఉండి, బీహార్ రాష్ట్రానికి చెందినవాడిగా భావిస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా అతను మతిస్థిమితం లేని స్థితిలో మఠంపల్లి ప్రాంతంలో భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగించేవాడని స్థానికులు తెలిపారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని స్థానిక గ్రామపంచాయతీ సిబ్బందుల సహకారంతో హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
Next Story






