- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైలు నుండి పడి గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం
కేసముద్రం రైల్వే స్టేషన్ వద్ద సోమవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది.

దిశ, కేసముద్రం: కేసముద్రం రైల్వే స్టేషన్ వద్ద సోమవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి దుర్మరణం చెందాడు. రైల్వే జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి అందించిన వివరాల ప్రకారం.. మృతుడి వయసు సుమారు 40 నుంచి 45 ఏళ్ల మధ్యగా ఉండొచ్చని తెలిపారు. అతను క్రీమ్ కలర్ 3/4 ప్యాంట్, నేవీ బ్లూ టీ-షర్ట్ ధరించి ఉండగా, నల్లటి జుట్టు, గడ్డం-మీసాలతో, గుండ్రని ముఖాకృతి కలిగి ఉన్నాడు. చామన ఛాయా రంగుతో పాటు కుడిపక్క చాతిపై పుట్టుమచ్చ ఉన్నట్లు పేర్కొన్నారు.
అతని వద్ద దానాపూర్ నుంచి పెరంబుర్ వరకు వెయిటింగ్ లిస్ట్ టికెట్ మాత్రమే ఉండగా, ఎటువంటి గుర్తింపు కార్డులు లభించలేదని చెప్పారు. మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి తరలించి భద్రపరిచామని, మృతుడి వివరాల గురించి ఎవరైనా సమాచారం తెలపగలరని కోరారు. వివరాల కోసం 98497 49220 లేదా 87126 58585 నంబర్లకు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.






