ఎడమ కాలువలో ఇద్దరు గల్లంతు

by Ratna Kumari |

వేములపల్లి మండల కేంద్రంలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువలో ఇద్దరు వ్యక్తులు గల్లంతైన సంఘటన చోటు చేసుకుంది.

ఎడమ కాలువలో ఇద్దరు గల్లంతు
X

దిశ‌, వేముల‌ప‌ల్లి : వేములపల్లి మండల కేంద్రంలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువలో ఇద్దరు వ్యక్తులు గల్లంతైన సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం మిర్యాలగూడ పట్టణం సుందర్ నగర్ కాలనీకి చెందిన మర్రి రవి(45), జలీల్, సతీష్ లు హోలీ ఆడిన అనంతరం మండల కేంద్రంలోని ఎడమ కాలువలో స్నానం చేయడానికి వచ్చారు. స్నానం చేస్తుండగా.. నీటి ప్రవాహ వేగానికి ప్రమాదవశాత్తు రవి, సతీష్ కాలువలో గల్లంతైనట్టు స్థానికులు పేర్కొన్నారు. సతీష్ మృత దేహం గరిడేపల్లి మండలం పొనుగోడు సమీపంలో లభించినట్టు తెలిసింది. రవి ఆచూకీ లభ్యం కాలేదు. రవి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుంటూ దర్యాప్తు చేపట్టిన పోలీసులు గల్లంతైన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు తెలిసింది. స్నానానికి ముందు మద్యం మత్తులో ఉన్నట్టు స్థానికులు పేర్కొంటున్నారు.

Next Story