అస్తికలు కలపడానికి వెళ్లి అనంత లోకాలకు

by Disha Web Desk 4 |
అస్తికలు కలపడానికి వెళ్లి అనంత లోకాలకు
X

దిశ, తుంగతుర్తి: తండ్రి మృతి చెందడంతో కుటుంబం అంతా విషాదంలో నెలకొంది. ఈ మేరకు అస్తికలు కలపడంతో పాటు తల్లి, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించే కార్యక్రమానికి ఆటోలో వెళుతూ ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ విషాదకర సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కాశి తండ గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి జరగగా శనివారం ఉదయం వెలుగు చూసింది. ముఖ్యంగా ఆటో ట్రాలీ డ్రైవర్ తాగి డ్రైవింగ్ చేయడం వల్లనే ఆటో బోల్తా కొట్టి ఈ దారుణ సంఘటనకు కారణమైంది. పోలీసులు,గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కాశితండ తండ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న మేఘ తండలో ఉన్న జాటోత్ నిమ్మ (80) వారం రోజుల క్రితం మృతి చెందారు. అయితే రావులపల్లి క్రాస్ రోడ్డు తండ గ్రామంలో ఉన్న కూతురు మంగమ్మ (55),ఇదే మండలం రామన్నగూడెం తండ గ్రామంలో ఉంటున్న మనవరాలు శారద (అంటే మంగమ్మ కూతురు), తదితరులంతా నిమ్మ మృతి చెందిన రోజు వెళ్లి వచ్చారు. అయితే తండ్రి అస్థికలను వాడపల్లిలో నిమజ్జనం చేయడానికి బంధువులంతా మేఘ తండకు రావాల్సి ఉంది.





ఇందులో భాగంగా పెద్ద కూతురు మంగమ్మ ఆమె భర్త సూర్య,వీరి ఇద్దరు బిడ్డలైన ఆంబోతు శారద (మహబూబాబాద్ జిల్లా,పెద్దవంగర గ్రామ పరిధిలోని రెడ్డి కుంట తండ నివాసి),ఆంబోతు శారద( సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రామన్నగూడెం తండ గ్రామం),మృతుడు నిమ్మ చిన్న కూతురు గూగులోతు బాలమ్మ తదితరులు అంతా కలిసి శుక్రవారం రాత్రి రావులపల్లి తండ గ్రామానికి చెందిన గుగులోతు రవీందర్ ఆటో ట్రాలీపై బయల్దేరారు. అయితే అప్పటికే రవీందర్ మద్యం తాగి ఆటోను వేగంగా నడవడంతో కాశి తండ గ్రామ శివారులో బోల్తా పడి పక్కనే ఉన్న రోడ్డు పక్క గోతులలో పల్టీలు కొట్టింది.

ఈ మేరకు అతి కష్టం మీద 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆస్పత్రికి వెళ్లారు. కాగా మార్గం మధ్యలో మంగమ్మ (55) మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కూతురు శారద (30)మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న బానోతు నీల,గూగులోతు బాలమ్మ, గూగులోతు సూర్య తదితరులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.ఇదిలా ఉంటే ఆటోలో ఉన్న ఇద్దరు చిన్నపిల్లలు మాత్రం క్షేమంగా బయట పడ్డారు.తుంగతుర్తి పోలీసులకు శనివారం ఉదయం ఈ సంఘటన తెలిసింది. సూర్యాపేటకు వెళ్లి బాధితుల నుండి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్ఐ ఆంజనేయులు "దిశ"కు తెలిపారు.


Next Story

Most Viewed