- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
by Bhanu |
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో జరిగింది.

X
దిశ, తుంగతుర్తి: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో జరిగింది. ఎస్ఐ క్రాంతి కుమార్ సోమవారం రాత్రి తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కట్ల ఉపేందర్ (45) ఆర్థిక ఇబ్బందులు తాళలేక గత నెల 28న ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారక మందు తాగి పడిపోయాడు.
కొద్దిసేపటి తర్వాత గమనించిన భార్య స్వరూప చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆనాటి నుండి చికిత్స పొందుతున్న ఉపేందర్ సోమవారం మృతి చెందారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.
Next Story






