బహుజనుల చైతన్యంతోనే రాజ్యాధికారం : టిఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్

by Nallavelli.Anjaneyulu |

దిశ, సూర్యాపేట : బహుజనుల చైతన్యంతోనే రాజ్యాధికారం దక్కుతుందని మేమెంతో మాకంత వాటా దక్కేంతవరకు పోరాటం చేస్తామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ అన్నారు.

బహుజనుల చైతన్యంతోనే రాజ్యాధికారం : టిఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్
X

దిశ, సూర్యాపేట : బహుజనుల చైతన్యంతోనే రాజ్యాధికారం దక్కుతుందని మేమెంతో మాకంత వాటా దక్కేంతవరకు పోరాటం చేస్తామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలో టిఆర్పీ కార్యాలయం లో నూతన సంవత్సర సందర్భంగా గురువారం జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. ఎస్సీ , ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అందరికీ ఈ ఏడాది అంతా శుభాలు కలగాలని, ఏడు దశాబ్దాలకు పైగా సింహభాగం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాల ప్రజలను అగ్రకులాలు పావులుగా వాడుకోవడం వలన బహుజనులు అధికారానికి దూరమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారంలో వాటా దక్కాలని బీసీల పక్షపాతి టీఆర్పీ రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న నాయకత్వంలో పార్టీ ఏర్పాటు చేసి 100 రోజులు పూర్తయిందని ఎన్నో గొప్ప విజయాలు సాధించామని అన్నారు.

స‌రికొత్త‌గా టీఆర్పీ వ్యూహ ర‌చ‌న‌..

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ప్రతి ఏడాది రూ.20 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతామని ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని తెలిపారు. బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కృతనిశ్చయంతో తీన్మార్ మల్లన్న పని చేస్తున్నాడని అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి గెలుపొందేలా టీఆర్పీ వ్యూహ రచన చేస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో బహుజన కులాలకు ఫలాలు దక్కేలా రాజ్యాధికారం దిశగా అగ్రకులాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టిఆర్పీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్, జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, పెన్ పహాడ్ మండల అధ్యక్షులు ఆవుల అంజయ్య యాదవ్,కోల కరుణాకర్, లింగాల సైదులు, జానకి రాములు, మల్లేష్, వర్రె కవిత,మీర్ పర్వీన్,బాల్మీకి దీపమాల, సంజన,బొమ్మగాని సైదులు, కుంభం వెంకన్న యాదవ్, వాల్లాల వెంకట్ యాదవ్, చింతకాయల జానయ్య యాదవ్, మల్లేష్ యాదవ్, కె. వెంకన్న, ఎండీ హుస్సేన్ పాల్గొన్నారు.

Next Story