దిశ ఎఫెక్ట్ : విరిగిన చెట్టు ఘటనపై స్పందించిన అటవీ శాఖ

by Bhanu |

నేరేడుచర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విరిగిన చెట్టు విషయంపై దిశ పత్రికలో మంగళవారం వచ్చిన కథనానికి అటవీ శాఖ

దిశ ఎఫెక్ట్ : విరిగిన చెట్టు ఘటనపై స్పందించిన అటవీ శాఖ
X

దిశ, నేరేడుచర్ల: నేరేడుచర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విరిగిన చెట్టు విషయంపై దిశ పత్రికలో మంగళవారం వచ్చిన కథనానికి అటవీ శాఖ స్పందించింది. హుజూర్‌నగర్ ఫారెస్ట్ రేంజ్ అధికారి అనంతరెడ్డి, సెక్షన్ ఆఫీసర్ గోవర్ధన్ కలిసి కళాశాలకు వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించారు.

కళాశాల ప్రాంగణంలో నేలపై పడిపోయిన చెట్టును వారు సమీక్షించి, ఇది ఎలా విరిగిందో ప్రిన్సిపాల్ వెంకటరమణని అడిగి వివరాలు తెలుసుకున్నారు. చెట్టు పతనానికి సంబంధించి లిఖితపూర్వక నివేదికను ప్రిన్సిపాల్ చేత తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.

ఈ రిపోర్టుతో పాటు తమ పరిశీలన ఆధారంగా రూపొందించిన నివేదికను ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తెలిపారు. అలాగే, విరిగిన చెట్టు స్థానంలో ఐదు మొక్కలు నాటాలని కళాశాల ప్రిన్సిపాల్‌ను ఆదేశించినట్టు పేర్కొన్నారు.

Next Story