ట్రాక్టర్ పల్టీ కొట్టి రైతు మృతి

by Bhanu |

ట్రాక్టర్ పల్టీ కొట్టి రైతు మృతి చెందిన సంఘటన గురువారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని సర్వారం గ్రామంలో జరిగింది.

ట్రాక్టర్ పల్టీ కొట్టి రైతు మృతి
X

దిశ, గరిడేపల్లి : ట్రాక్టర్ పల్టీ కొట్టి రైతు మృతి చెందిన సంఘటన గురువారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని సర్వారం గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటి ఉపేందర్ రెడ్డి (40) ఉదయం ట్రాక్టర్ తో తన పొలాన్ని దున్నటానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో మార్గ మధ్యలో ట్రాక్టర్ పల్టీ కొట్టడంతో ఉపేందర్ రెడ్డి ట్రాక్టర్ క్రింద అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Next Story