- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పరవళ్లు తొక్కుతున్న మూసీ.. రాకపోకలకు అంతరాయం
ఎగువ ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా బ్రిడ్జిపై నుండి వరద నీరు ఉదృతంగా రావడంతో శుక్రవారం మూసీనది పరవళ్ళు తొక్కుతుంది.

దిశ, భూదాన్ పోచంపల్లి: ఎగువ ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా బ్రిడ్జిపై నుండి వరద నీరు ఉదృతంగా రావడంతో శుక్రవారం మూసీనది పరవళ్ళు తొక్కుతుంది. భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జూలూరు - రుద్రెల్లి గ్రామాల మధ్య గల బ్రిడ్జి మీద నీరు ప్రవహించడంతో ఇరు గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోచంపల్లి నుండి బీబీనగర్ వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి. అయితే ఈ బ్రిడ్జిపై మూసి నీరు పారుతుండడంతో బీబీనగర్, భువనగిరి వెళ్లాలంటే పెద్దరావులపల్లి, బట్టుగూడెం మీదుగా సుమారు 20 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇరు గ్రామాల మధ్య అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బ్రిడ్జి వద్దకు పోలీసు అధికారులు చేరుకొని బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. మూసి పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గొర్రెలు, పశువుల కాపరులు మూసీ నది వైపు వెళ్ళద్దని హెచ్చరికలు జారీ చేశారు.






