విద్యుత్తు వైర్లు తగిలి ట్రాక్టర్ పై తరలిస్తున్న గడ్డి దగ్ధం

by Bhanu |

రాజపేట మండలం బొందుగుల గ్రామ శివారులో గురువారం ట్రాక్టర్ పై తరలిస్తున్న గడ్డి విద్యుత్ వైర్లు తగిలి దగ్ధమైంది.

విద్యుత్తు వైర్లు తగిలి ట్రాక్టర్ పై తరలిస్తున్న గడ్డి దగ్ధం
X

దిశ, రాజపేట: రాజపేట మండలం బొందుగుల గ్రామ శివారులో గురువారం ట్రాక్టర్ పై తరలిస్తున్న గడ్డి విద్యుత్ వైర్లు తగిలి దగ్ధమైంది. బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామం నుండి తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామం చెందిన రైతులు పశువుల కోసం గడ్డిని కొనుగోలు చేసి ట్రాక్టర్ పై తరలిస్తుండగా బొందుగుల సమీపంలో కిందికి వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగిలి మంటలు వ్యాప్తి చెందాయి. దీంతో డ్రైవర్, పాడి రైతులు తప్పించుకోగా అందులో ఒకరికి చేయి కాలింది. గంటకు పైగా ఆ రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. డ్రైవర్ చాకచక్యంతో ట్రాక్టర్ దగ్ధం కాకుండా గడ్డిమోపులను కింద పడేలా చర్యలు తీసుకున్నారు. బాధిత పాడి రైతులకు ఆర్థిక సాయం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.


Next Story