- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాటిచెట్టు పైనుంచి జారిపడి కల్లుగీత కార్మికుడి దుర్మరణం
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తంగడపల్లి కి చెందిన చెరుకు సత్తయ్య (54) అనే గీత కార్మికుడు ప్రమాదవశాత్తు కాలు జారి తాటి చెట్టు పైనుంచి కిందపడి దుర్మరణం చెందాడు.

దిశ, చౌటుప్పల్ టౌన్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తంగడపల్లి కి చెందిన చెరుకు సత్తయ్య (54) అనే గీత కార్మికుడు ప్రమాదవశాత్తు కాలు జారి తాటి చెట్టు పైనుంచి కిందపడి దుర్మరణం చెందాడు. చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ మన్మధకుమార్ కథనం ప్రకారం.. కల్లు గీత కార్మికుడిగా పని చేసే చెరకు సత్తయ్య రోజూ లాగే కల్లు తీయడానికి రెడ్డిచెరువు వద్దకు వెళ్లాడు. తాటి చెట్టు ఎక్కి కిందకు దిగుతుండగా మోకు జారి పైనుంచి కింద పడడంతో సత్తయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న స్థానికులు గమనించి సత్తయ్యను వైద్య చికిత్సల నిమిత్తం చౌటుప్పల్ లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించగా చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచాడు. అతని కొడుకు చెరుకు మల్లేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ మన్మధకుమార్ తెలిపారు.






