- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏవండోయ్ ఇది తిన్నారా..! ఈగలు, వెంట్రుకలతో బిర్యాని.. తిరుమల గ్రాండ్ హోటల్ లో
సూర్యాపేట పట్టణంలోని పేరు ప్రఖ్యాతి గల తిరుమల గ్రాండ్ హోటల్‌కి చెందిన బిర్యానీ తాజా వివాదానికి కేంద్రంగా మారింది. తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో ఉన్న ఈ హోటల్‌కు మంగళవారం మధ్యాహ్నం ముగ్గురు కస్టమర్లు విచ్చేసి బిర్యానీ ఆర్డర్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సూర్యాపేట పట్టణంలోని పేరు ప్రఖ్యాతి గల తిరుమల గ్రాండ్ హోటల్‌కి చెందిన బిర్యానీ తాజా వివాదానికి కేంద్రంగా మారింది. తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో ఉన్న ఈ హోటల్‌కు మంగళవారం మధ్యాహ్నం ముగ్గురు కస్టమర్లు విచ్చేసి బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే అందులో ఒకరి ప్లేట్‌లో ఈగలు కనిపించడం సంచలనం రేపింది.
ఇంతకే కాదు, పక్క టేబుల్ వద్ద ఉన్న మరో ఇద్దరు కస్టమర్లు కూడా అదే హోటల్ బిర్యానీ ఆర్డర్ చేశారు. వారిలో ఒకరు చికెన్ బిర్యానీ, మరొకరు మష్రూమ్ బిర్యానీ తీసుకోగా, మష్రూమ్ బిర్యానీలో తల వెంట్రుకలు కనిపించాయి. ఈ దృశ్యాలన్నీ గమనించిన కస్టమర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఆన్‌లైన్ రేటింగ్ చూసి, మంచి ఫుడ్ ఆశించి హోటల్‌కి వచ్చామని వారు హోటల్ మేనేజ్మెంట్‌కి తెలిపారు. అయితే మేనేజ్‌మెంట్ మాత్రం "ఇది అనుకోకుండా జరిగింది, కావాలని ఇలా ఎవరూ చేయరు" అంటూ సర్ది చెప్పి, బిల్లు చెల్లింపుతో పంపించారని తెలుస్తోంది. తీరా నిరాశ చెందిన కస్టమర్లు ఈ విషయం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అనంతరం వారు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.






